చాకలి ఐలమ్మ స్ఫూర్తి, ఆమె పోరాటం ప్రతి తరానికి మార్గదర్శకం

పయనించే సూర్యుడు: జూన్:2/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్:గద్దె. విజయ బాబు వేంసూర్ మండలం కందుకూరు గ్రామంలో నేడు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ బాయనసత్యం గారు, రజక సోదరులు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాకలి ఐలమ్మ ఆశయాలకు నిజమైన నివాళి. దొరల పెత్తందారీకి, నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలబడి "అన్యాయానికి తలవంచేది లేదు" అని చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మహావీరనారి చాకలి ఐలమ్మ. తన కుటుంబం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, తన పోరాటాన్ని ఆపలేదు. బడుగు, బలహీన వర్గాలకు ఆత్మవిశ్వాసాన్ని నింపి, అణగారిన ప్రజల హక్కుల కోసం చివరి వరకు పోరాడిన యోధురాలు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి సామాజిక న్యాయ పోరాటాల వరకు ప్రతి అడుగులోనూ చాకలి ఐలమ్మ స్ఫూర్తి కనిపిస్తుంది. అందుకే ఆమెను కేవలం ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయకుండా తెలంగాణ జాతి గర్వంగా గుర్తించాలి. ప్రభుత్వం చాకలి ఐలమ్మ సేవలను మరింత ఘనంగా గుర్తించి, ఆమె పేరును ఒక జిల్లాకు నామకరణం చేయాలని, హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. గ్రామ గ్రామాన చాకలి ఐలమ్మ విగ్రహాలు నెలకొల్పి యువతకు ఆమె పోరాట చరిత్రను తెలియజేయాలి. నేటి యువత చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ, త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిస్తున్నాము. ఈ కార్యక్రమంలో నాతో పాటు పట్టణ బీజేపీ అధ్యక్షులు బానోతు విజయ్ డాక్టర్ పెద్ది రాజు మంద శివ సత్తుపల్లి నియోజకవర్గ బీసీ సంఘాల అధ్యక్షులు కోమటి తిరుమలరావు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాయల రిషి రాయల వెంకటేశ్వరావు, పాలకొల్లు శ్రీనివాస్ రావు, ఎదుళ్ళ మురళి,రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు