పయనించే సూర్యుడు జూన్ 12, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). బదిలీ ప్రక్రియలో భాగంగా చింతకాని పోలీస్ స్టేషన్‌కు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులైన శ్రీ జి. నరేష్ పాతర్లపాడు గ్రామ ఉప సర్పంచ్ దారెల్లి సురేష్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ నరేష్ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో విశిష్ట సేవలు అందించాలని కోరుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొని నూతన ఎస్‌ఐకి అభినందనలు తెలియజేశారు.