చింతకాని నూతన ఎస్సై జి. నరేష్‌కు బీజేపీ నాయకుల శుభాకాంక్షలు

పయనించే సూర్యుడు జూన్ 14, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని : చింతకాని పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జి. నరేష్ను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ బీజేపీ నాయకులు తమ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చింతకాని మండల బీజేపీ అధ్యక్షుడు కొండా గోపి, మండల ప్రధాన కార్యదర్శులు ఇమ్మడి సత్యనారాయణ, గోదా మంగయ్య, సీనియర్ నాయకులు అనగాని రామారావు, కోరిపల్లి శీను, కొండ వెంకన్న, వలను కొండ నరసింహారావు, వేముల ఎల్లయ్య, బుర్ర శ్రీనివాసరావు, బక్క సత్యమూర్తి, బీజేపీ యువ మోర్చా నాయకులు సత్తెనపల్లి గోపి, ముంతా సిద్ధార్థ్, చింతాల నరేష్, చిర్రా నాగరాజ్, చింతాల తాతారావు, చింతాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.