02 Nov 2026 | 11:42 PM

చింతకాని మండల స్థాయి క్రీడా పోటీల్లో శ్రీ గ్లోబల్ హై స్కూల్ బాలికల సత్తా

-జూనియర్స్, సీనియర్స్ కబడ్డీ విభాగాల్లో ద్వితీయ స్థానం కైవసం

పయనించే సూర్యుడు నవంబర్ 03,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు ). చింతకాని : మండల స్థాయి క్రీడా పోటీల్లో శ్రీ గ్లోబల్ హై స్కూల్ నాగులవంచ బాలికల జట్లు ప్రతిభను చాటుకున్నాయి. జూనియర్స్ కబడ్డీ విభాగంలో రెండవ స్థానాన్ని, సీనియర్స్ విభాగంలోనూ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుని పాఠశాలకు గర్వకారణంగా నిలిచాయి. కొదుమూరు వేదికగా నిర్వహించిన చింతకాని మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలికల విభాగంలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థినులు తమ ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ క్రీడా పోటీలను మండల విద్యాశాఖ అధికారి సలాది రామారావు, నాగులవంచ పాఠశాల హెచ్‌ఎం కనపర్తి వెంకటేశ్వరరావు, కొదుమూరు గ్రామ స ర్పంచ్, కొదుమూరు పాఠశాల హెచ్‌ఎం, ఎస్‌జీఎఫ్ చింతకాని మండల కార్యదర్శి పూనాటి వెంకటేశ్వరరావు, పీడీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జూనియర్స్, సీనియర్స్ రెండు విభాగాల్లోనూ ద్వితీయ స్థానాలు సాధించిన శ్రీ గ్లోబల్ హై స్కూల్ బాలికల జట్లను పాఠశాల యాజమాన్యం ఇనుకుల్లా దివాకర్ రెడ్డి, వాహిని, తిరుపతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ తన్నీరు రామారావు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థినులు క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.