చింతూరు మండల అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ సమక్షంలో టీడీపీలో చేరిన 60 కుటుంబాలు

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 7 యం,ఎల్,ఏ మిర్యాల శిరీష భాస్కర్ గారి అధేనుషరం చింతూరు మండల పరిధిలోని కల్లేరు పంచాయతీ మధుగురు గ్రామంలో తెలుగుదేశం పార్టీలోకి భారీ వలసలు చోటుచేసుకున్నాయి. చింతూరు మండల పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ సమక్షంలో మధుగురు గ్రామానికి చెందిన సుమారు 60 కుటుంబాలు సీపీఎం పార్టీను వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మధుగురు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో మండల అధ్యక్షులు మొహమ్మద్ జమాల్ ఖాన్ పార్టీలో చేరిన వారందరికీ టీడీపీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మొహమ్మద్ జమాల్ ఖాన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై, పార్టీ సిద్ధాంతాలపై నమ్మకంతోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కుటుంబాలు పార్టీలో చేరడం సంతోషకరం. మండలంలో పార్టీ బలోపేతానికి, మధుగురు గ్రామ సమగ్ర అభివృద్ధికి కొత్తగా చేరిన వారందరితో కలిసికట్టుగా ముందుకు సాగుతాం. ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అని ఆయన హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన గ్రామస్థులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాలు, జమాల్ ఖాన్ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులమై తాము టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చింతూరు మాజీ మండల అధ్యక్షులు జహంగీర్ మార్కెట్ కమిటీ సభ్యులు పసుపులేటి సల్మాన్ రాజు ,చింతూరు మండల మహిళా కార్యదర్శి పోడియం సావిత్రి, సత్తిబాబు,చింతూరు మాజీ సర్పంచ్ సోడే శ్రీను మరియు మధుగురు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.