చిన్నారి కీర్తన, కార్తీక్ లను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్

పయనించే సూర్యుడు న్యూస్ :జూన్ 4,తల్లాడ రిపోర్టర్ అన్నారుగూడెం గ్రామం లో తాళ్ల గంగరాజు (లేటు) లూర్డు మేరీ దంపతుల కుమార్తె కీర్తన కుమారుడు కార్తీక్ ల ఓనిలో పంచ కట్టు వేడుక బుధవారం అన్నారుగూడెం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు

దుగ్గిన్ని రావమ్మకు నివాళులర్పించిన డాక్టర్ మట్టా దయానంద్

అన్నారుగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుక్కినేని గోపయ్య మాతృమూర్తి రావమ్మ ఇటీవల మరణించారు. బుధవారం అన్నారు గూడెం గ్రామంలో ఆమె దశదినకర్మను నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద హాజరై నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు

ఇందిరమ్మ గృహాల సందర్శించిన డాక్టర్ మట్టా దయానంద్

అన్నారుగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను బుధవారం డాక్టర్ మట్టా దయానంద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో మరిన్నిందిరమ్మ గృహాలను అన్నారుగూడెం గ్రామానికి అందిస్తామని హామీ ఇచ్చారు. పేదల సొంతింటి కలలు నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా దయానంద్ అన్నారు. నూతనందిరమ్మ గృహాలను దయానంద్ సందర్శించిన సందర్భంగా లబ్ధిదారుల మహిళలు ఎంతగానో సంతోషపడ్డారు. ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు డాక్టర్ మట్టా దయానంద్ ను శాలవాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీనివాసరావు, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడుగునూరి లక్ష్మీరెడ్డి, జక్కంపూడి కిషోర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘుపతి రెడ్డి, అన్నారుగూడెం మాజీ వి డి సి చైర్మన్ మారెళ్ళ మల్లికార్జునరావు, మాజీ ఎంపీటీసీ తాళ్ళ జోసెఫ్, దీవెల కృష్ణయ్య వెంకటగిరి సర్పంచ్ వెంకటేశ్వరరావు, గణేశుల రవి తెలగారం సర్పంచ్ కాళోజి, రాయల రాము, గోపాలపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ల వెంకటి, పెద్ద తిరుమలయ్య,తల్లాడ మండలం యువజన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వారాల అజై అన్ని గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు మాజీ ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్నారుగూడెం కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట వెంకటేశ్వర్లు గోవింద్ నరసయ్య, కిసింది, గొడ్ల కృష్ణ , ముఠా సభ్యులు,వార్డు నెంబర్ దావీదు, వెల్లంకి వెంకటయ్య, యుత్ కాంగ్రెస్ నాయకులు విజయ్,రంగా, రాకేష్ తదితరులు పాల్గొన్నారు