చిన్న సన్న వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నీలుస్తుంది.

స్వయంగా చిన్నసన్న ఇండస్ట్రీ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ భూమిని తక్కువ ధరకు అందిస్తుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప

పయనించే సూర్యుడు మే 26 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్న సన్న వ్యాపారస్తులకు స్వయంగా వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ పరంగా అండగా నిలిచింది, అంతేకాదు ఇప్పుడు ఇంకొక ముందడుగు వేసి ప్రభుత్వ భూమి ఎక్కడుంది ఆ భూమిని తక్కువ ధరకు వ్యాపారస్తులకు అందించడానికి ముందుకు వచ్చింది, అందులో భాగంగా మన ఆదోని నియోజకవర్గంలో కూడా అందించడం జరుగుతుంది, ఇది వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు, ఆదోని వ్యాపారపరంగా ఎంతో వెనకబడింది, ఆదోనిలో ప్రభుత్వ భూమి చాలా ఉంది, ఇండస్ట్రీలు తీసుకొని రావాలని ఎమ్మెల్యే కి తెలిపినరు, ఇండస్ట్రియల్ వస్తే రైతులకు భూమి విలువ పెరుగుతుంది ప్రజలకు ఉపాధి దొరుకుతుంది, అంతేకాదు చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి, అని తెలిపినారు. ఈ కార్యక్రమానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆదిత్య కృష్ణమ్మ హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు విట్టా రమేష్ రేపటి మాధవ్ మరియు కూటమి నాయకులు ఆదోని తాసిల్దార్ మరియు అధికార బృందం పాల్గొనడం జరిగింది, ఆదోని చుట్టుపక్కల గ్రామాల చిన్న సన్న వ్యాపారస్తులు కూడా పాల్గొన్నారు.