చెట్లు నాటుదాం పర్యావరణాన్ని కాపాడదాం

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ

పయనించే సూర్యుడు జూన్ 6వ డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు పెరుగుతున్న కాలుష్యం వాతావరణ మార్పుల నేపథ్యంలో చెట్ల పెంపకం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ప్రకృతిని కాపాడేందుకు ముందుకు రావాలని శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ కోరారు,ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎక్స్ ఎంపీపీ మురళి , బిస్తా ఓంకార్ , కల్లుబావి మల్లికార్జున, అలసంద గుత్తి రాజాశేఖర్, బాబురావు, రాఘవరెడ్డి, భరత్, పగల హనుమంతు, వెంకట్ నారాయణ, అంజి, చంద్ర, దేవేంద్ర, విజయ్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు