చెత్త కాదండోయ్ అది బంగారుగని

మున్సిపల్ ఖజానా దోచేసి జేబులు నింపుకుంటున్నా నాయకులు?

పయనించే సూర్యుడు జూన్ 15 ఆదోని డివిజన్ ప్రతినిధి గుమ్మల బాలస్వామి ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని సిరుగుప్ప చెక్‌పోస్ట్ సమీపంలోని కంపోస్టు యార్డ్ ఇప్పుడు అధికార కూటమి నేతలకు బంగారు గని గా మారిందా అనే అనుమానాలు, వ్యక్తమవుతున్నాయి ప్రజల చెత్తతో తయారైన కంపోస్టు కూడా వదలకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో తరలించి రైతులకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి, ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయం కొందరి జేబుల్లోకి వెళ్లిపోతుంటే, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఎవరికి సేవ చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మున్సిపల్ ఆస్తిని కాపాడాల్సిన కమిషనర్ సహా అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారా? లేక ఈ వ్యవహారంలో, భాగస్వాములయ్యారా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఒకవైపు రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం మరోవైపు మున్సిపాలిటీ ఆదాయ వనరులనే కొందరు నాయకులు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు రావడం దారుణమని స్థానికులు మండిపడుతున్నారు ఇసుక వదలలేదు భూములు వదలలేదు ఇప్పుడు చెత్తను కూడా వదలట్లేదు అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో తయారైన కంపోస్టును వ్యక్తిగత వ్యాపారంగా మార్చి విక్రయించడం జరిగి ఉంటే అది ప్రజా సంపదపై బహిరంగ దోపిడీతో సమానమని విమర్శలు వినిపిస్తున్నాయి ఈ వ్యవహారంపై వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి, కంపోస్టు విక్రయాల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది? ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది? ఎవరి అనుమతితో విక్రయాలు జరిగాయి? అనే విషయాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఒక్క రూపాయి కూడా మింగితే వదిలిపెట్టకూడదని, బాధ్యుల నుంచి ప్రతి పైసా వసూలు చేసి మున్సిపాలిటీ ఖాతాలో జమ చేయాలని ప్రజలు కోరుతున్నారు చెత్తలో కూడా కమీషన్లు వెతికే పాలనకు ఇదే నిదర్శనమా? అంటూ ఆదోని ప్రజలు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు