చెన్నయ్యకట్టు అలుగు కాలువ మరమ్మత్తు పనులకు శ్రీకారం

పయనించే సూర్యుడు న్యూస్ మే 25 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల పరిధిలోని అచ్యుతాపురం గ్రామంలో చెన్నయ్యకట్టు (పెద్దచెరువు) అలుగు కాలువ మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శ్రీకారం చుట్టారు. ఆదివారం అచ్యుతాపురం గ్రామంలో పర్యటించి చెన్నయ్యకట్టు (పెద్దచెరువు) అలుగు కాలువ మరమ్మత్తు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గతంలో కురిసిన భారీవ ర్షాల కారణంగా చెరువు అలుగు కాలువకు గండ్లు పడిన విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సమ స్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ఆ నిధులతో గండ్లు పూడ్చి కాలువను బలోపేతం చేసే పనులు చేపడు తున్నట్లు ఎమ్మెల్యే జారె తెలిపారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, మాజీ మండల అధ్యక్షులు తుమ్మా రాం బాబు, స్థానిక సర్పంచ్ సరిహద్దుల పోలయ్య, కాం గ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.