చేగుంట మండలం పెద్ద శివునూర్ లో కొనసాగుతున్న జనగణన

పయనించే సూర్యుడు న్యూస్ మే 24 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్దశివునూర్ గ్రామంలో మొదటి విడత జనగణన దిగ్విజయంగా కొనసాగుతుంది. స్థానిక ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయురాలు సంతోషి ఎన్యుమరేటర్లుగా ప్రతిరోజు ఉదయాన్నే గ్రామాన్ని చుట్టేస్తున్నారు. గ్రామ ప్రజల సహకారంతో ఇప్పటికే 70%పైగా జనగనన పూర్తి చేసామని ఉపాధ్యాయులు చెబుతున్నారు కొన్ని ఇండ్లకు తాళాలు వేసి ఉండటంతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నందున ప్రజలు కొన్ని రోజులు ఇంటివద్ద ఎవరినైనా ఉంచినట్లుయితే త్వరగా పూర్తి చేయడానికి వీలుపడుతుందని తెలియజేసారు. కాగా వచ్చే నెల అనగా జూన్ 9వరకు జనగనన కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో చేగుంట మండల మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు గ్రామస్తులు. అప్పల ప్రశాంత్ అన్నం శ్రీనివాస్ ఎర్ర ఎల్లయ్య అప్పల శంకర్ అన్నం సిద్ధ రాములు అన్నం యాదగిరి మల్లయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు