చేజర్లలో ఓటర్లకు స్వచ్ఛంద సహాయ కేంద్రం

పయనించే సూర్యుడు జూలై 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ ఐ ఆర్ కార్యక్రమంలో భాగంగా, ఓటర్లకు స్వచ్ఛందంగా సహాయం అందించేందుకు ప్రతి ఓటరుకు బిఎల్వో లు అందించిన ఎన్నుమురేషన్ ఫామ్ పూర్తిచేసే పక్రియలో భాగంగా చేజర్ల మండలం మరియు గ్రామపంచాయతీ ఓటర్లకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు కేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ సహాయ కేంద్రంలో ఓటర్లకు అన్ని రకాల సౌకర్యాలు అనగా ఫామ్ ఫిల్ చేయడం, 2002 ఓటరు జాబితా, సర్టిఫికెట్లు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అన్ని ఉచితం గా ఒకే చోట చేసి ఇవ్వబడును. కావున చేజర్ల గ్రామపంచాయతీలోని ఓటర్లందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించు కోవాల్సిందిగా కోరడమైనది. స్థలం: ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ రెడ్డి ఇల్లు కార్యాలయం చేజర్ల .ఈ సహాయ కేంద్రం ఓటర్లకు ఉచితంగా దరఖాస్తులు పూరించడంలో సహాయం అందించే స్వచ్ఛంద సేవా కేంద్రం మాత్రమే. ఇది భారత ఎన్నికల సంఘం లేదా ఎన్నికల శాఖ యొక్క అధికారిక కార్యాలయం కాదు. దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణ మరియు తుది నిర్ణయం సంబంధిత ఎన్నికల అధికారులదే. తూమాటి విజయ భాస్కర్ రెడ్డి ఎంపీపీ. చేజర్ల సహాయ కేంద్రం నిర్వాహకులు. సెల్:8374332694. 9100100611. పని వేళలు: ఉదయం 10 నుండి రాత్రి 7 గంటల వరకు ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు