చేజర్ల ఎస్టి అంగన్వాడి కేంద్రంలో కిషోరీ వికాసం కార్యక్రమం

పయనించే సూర్యుడు మే 23 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) వేసవి సెలవుల కిషోరీ వికాసంలో భాగంగా మండల కేంద్రమైన నిచేజర్ల ఎస్టికాలనీ నందు కిషోరీ వికాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు కార్యక్రమం ఆర్థిక నిర్వహణలో భాగంగా కిషోర్ బాలికలను తల్లులను హాజరు పరిచి వారికి ఆర్థికంగా ఏ విధంగా మనం డబ్బు ఆదా చేయవలెను అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని ప్రతి ఒక్కరు కూడా అవసరమైన ఖర్చులను మాత్రమే చేస్తూ డబ్బు పొదుపు చేస్తూ అవసరమైనప్పుడు డబ్బులు వాడుకునేలా అందరూ కూడా ఆలోచించి క్రెడిట్ కార్డులు అప్పులు చేయడం లాంటివి తగ్గించుకొని కుటుంబానికి ఆర్థికంగా సహాయ పడగలను కిశోరీ బాలికలందరికి తెలియజేయడం జరిగింది ఇంకా రక్తహీనత మరియు పరిశుభ్రత హెల్ప్ లైన్ నెంబర్లు 181 మరియు 1098 గురించి బాల్యవివాహాలు గురించి తెలియజేస్తూ 18 సంవత్సరాలు నిండే వరకు ఎవరు కూడా వివాహం చేసుకోకూడదు అలా చేసుకున్న ఎడల చట్టరీత్యా నేరము కనుక కిషోరీ బాలికలు అందరూ కూడా ఎవ్వరూ బడి కాలేజీలు మానివేయకుండా అందరూ చదువులు కొనసాగించుకుని చదువులు పూర్తి చేసుకుని ఏదో ఉద్యోగం చేసుకునే విధంగా అందరూ కూడా చదువుకొని ఆర్థికంగా బాగా ఎదగాలని బాలికలకు తల్లులకు అందరికీ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమం సూపర్వైజర్ ఎం. పద్మ అంగన్వాడి ఆయాలు పాల్గొన్నారు