చౌడు భూములలో వరి పంటను బాగు చేయు చర్యల పై రైతులకు అవగాహన

పయనించే సూర్యుడు జూలై 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలంలో పెరుమాళ్ళ పాడు గ్రామంలో ఒక రైతు చౌడు భూములలో వరి రకం కేఎన్ఎం 16 38 రకం ని వితుక్కోవడం జరిగింది .ఎక్కువ ఎండ వేడిమి వల్ల చౌడు భూములలో పొలంలో నీరు పెట్టినా కూడా మొక్కలు ఎండు ముఖం పట్టడం చూసాము దీనికి కారణం భూమిలోని లవణాలు పైకి వచ్చేస్తాయి . ఈ యొక్క లవణాల సాంద్రత పెరుగుట వలన మొక్కల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది మొక్కలు ఎండు ముఖం పట్టేస్తాయి దీనికి విరుగుడుగా చౌడు భూములలో వరి పంటను బాగు చేయు చర్యలు 1.పొలంలో నీరు బాగా పారించి బయటకుతీయాలి. దీనివలన కరిగిన లవణాలు బయటకు పోతాయి. తరువాత నీరు తక్కువగా ఒక పొర లాగా పెట్టి ఎకరాకు క్లీన్ ద్రవము -250 మి. లీ ఆర్గానిక్ జింక్ - 1 కి లో.యూరియా 15 కి. లొ లు కలిపి చల్లాలి. 3.ఒక వారం తర్వాత ఎకరాకు క్లీన్ ద్రవము -2 50మి. లీ 15 కె జి యూరియా కలిపి చల్లాలి. పాడి గోల్డ్ పొడి - 75 గ్రాములు పై పాటుగా 150 మి. లీ నీటిలో కలిపి స్ప్రేయింగ్ చేయాలి. 4.ఒక వారం తర్వాత ఎకరాకు 35 కిలోల యూరి య 10 కే జి పొటాష్ కలిపి చల్లండి 5.భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ . కాంప్లెక్స్ ఎరువులు వాడరాదు. అవసరాన్ని బట్టి నీరు పెట్టీ తీస్తూ ఉండండి. క్లీన్ ,ఆర్గానిక్ జింక్ మరియు పాడి గోల్డ్ గురించిన వివరాలకు 9347070333 .దయాకర్ రెడ్డి ని సంప్రదించండి. మండల వ్యవసాయ అధికారి హిమబిందు తెలిపారు

.