జగ్గయ్యపేటలో ఘనంగా నిర్వహించిన “యోగాంధ్ర” కార్యక్రమం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జగ్గయ్యపేట సీఐ ఆధ్వర్యంలో

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 8 జగ్గయ్యపేట, చిల్లకల్లు పోలీస్ స్టేషన్లు మరియు మున్సిపల్ శాఖ సంయుక్తంగా “యోగాంధ్ర” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. అలాగే తహసీల్దార్ , మున్సిపల్ కమిషనర్ , ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ యోగా సాధన చేస్తున్న సభ్యులు, డైలీ వాకర్స్, జగ్గయ్యపేట మరియు చిల్లకల్లు పోలీస్ స్టేషన్ల పరిధిలోని బ్యాడ్ క్యారెక్టర్లు, “డ్రగ్స్ పై దండయాత్ర–2.0” కార్యక్రమంలో పాజిటివ్‌గా గుర్తించబడిన వ్యక్తులు, గాయత్రి మహిళా యోగా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగ శిక్షణను సూర్య యోగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ లుగేంద్ర పిళ్లై మరియు ఆ సంస్థ సభ్యురాలు సిరిపిరెడ్డి లీలావతి నిర్వహించి యోగా ఆసనాలు, ప్రాణాయామం మరియు ధ్యాన పద్ధతులపై పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు. సుమారు 200 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ మరియు సానుకూల ఆలోచన విధానం పెంపొందుతాయని వివరించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని సూచించారు. సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడం, యోగా పట్ల అవగాహన కల్పించడం మరియు మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలను భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు