02 Nov 2026 | 10:42 PM

జనసేన పార్టీ ఉమ్మడి కూటమి మంత్రాలయం

3 ఎంపీటీసీ అభ్యర్థి బి సులోచనను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న.

పయనించే సూర్యుడు నవంబర్ 3 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం మంత్రాలయం టౌన్ లో మంత్రాలయం 3 ఎంపీటీసీ అభ్యర్థి బి సులోచనను గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి మరియు జడ్పిటిసి అభ్యర్థి ఆర్ లక్ష్మయ్య సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాఘవేంద్ర నగర్ లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామకృష్ణారెడ్డి కుమారుడు ఎన్ రాజారెడ్డి పాల్గొన్నారు . ప్రచార కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ వాల్మీకి బి లక్ష్మన్న మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వన రాష్ట్రం అభివృద్ధి దిశలో పరుగులు తీస్తోందని సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. కావున ఎంపీటీసీ అభ్యర్థి బీ సులోచన గాజు గ్లాస్ గుర్తుకు జడ్పిటిసి అభ్యర్థి ఆర్ లక్ష్మయ్యకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచార కార్యక్రమంలో ప్రజలను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బివి రవిచంద్ర, బీబీసీ చిన్న ( బొజ్జ మోహన్ ), ఉదయ్, అంజి, గిడ్డయ్య, వన్నూరి, టిడిపి సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ వరదరాజులు, పవన్, మేకల నరసింహులు, శివ, చిన్న బీమా, బుడగ జంగాల బసవ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు టిడిపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.