జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ జన్మదిన వేడుకలు

హుజురాబాద్ బీసీ జేఏసీ సాగర్ ఆధ్వర్యంలో సీఐ పులి వెంకట్ కు ఘన సన్మానం

పయనించే సూర్యుడు జులై 9 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ జన్మదిన సందర్భంగా హుజురాబాద్ బీసీ జేఏసీ నాయకులు ఇప్పకాయల సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ బీసీ జేఏసీ గౌరవ ఆధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, చట్టానికి ప్రతినిధిగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయాన్ని అందిస్తూ, తన వృత్తికి వన్నె తీసుకొని రావాలని కోరినారు. అదే విధంగా సమాజంలోని ముఖ్యంగా బడుగు బలహీన అట్టడుగు వర్గాల ప్రజలకు తన సేవలు అందుబాటులో ఉండునట్లు విధిని నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజలందరి ఆదరాభిమానాన్ని చురగొని రాష్ట్రంలోనే ఒక ఉన్నత పోలీస్ అధికారిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న, ప్రధాన కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్, కొలిపాక క్రాంతి కుమార్ తదితరులు పాల్గొని మంచి అధికారిగా పేరు పొందాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేయడం జరిగినది