జర్నలిస్టుల పక్షపాతి రామసుబ్బారెడ్డి

★ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు ★ పేదలకు అన్నదానం

పయనించే సూర్యుడు-09-06-2026-రాజంపేట న్యూస్ : గ్రామీణ ప్రాంతం నుంచి జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పల్లెటి రామసుబ్బారెడ్డి జర్నలిస్టుల పక్షపాతిగా చెరగని ముద్ర వేసుకున్నారని జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, తాలూకా అధ్యక్షులు ఇండ్లూరి చిన్న వెంకటరెడ్డి కొనియాడారు.సోమవారం రామసుబ్బారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్లమెంట్ కేంద్రమైన రాజంపేట పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ వద్ద ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. జర్నలిస్టులపై జరిగే దాడులను ఖండిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఏపీయూడబ్ల్యూజే యూనియన్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. నిత్యం జర్నలిస్టులకు అందుబాటులో ఉంటూ మార్గదర్శిగా ముందుకు సాగుతున్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు కార్తీక్, ఓబులేసు, కొత్తపల్లి గణేష్, శివయ్య నాయుడు, మందా శివయ్య, రాయలు, శ్రీహరి, పెయ్యల శివ, నాగేంద్ర ప్రసాద్, దుర్గయ్య, నరసింహ, రవీంద్ర, సాయి, సుధాకర్, చామంచి వెంకట సుబ్బయ్య, చంద్రశేఖర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.