జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం… వొడితల ప్రణవ్.

- జర్నలిస్టులు తీసుకున్న నిర్ణయానికి అభినందిస్తున్న... - ప్రజా సమస్యల పరిష్కారానికి వారధిగా జర్నలిస్టులు పని చేయాలి. - జర్నలిస్ట్ కుటుంబానికి ప్రమాద భీమా పోస్టల్ బాండ్ అందజేసిన హుజురాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్..

పయనించే సూర్యుడు మే 20 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని,ప్రజా క్షేత్రంలో పనిచేసే మీడియా మిత్రులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కోరారు. మంగళవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని హుజురాబాద్ క్లబ్ లో మీడియా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు.దీనికి ముఖ్య అతిథిగా ప్రణవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన చిర్ర సుదర్శన్ కుటుంబానికి ప్రమాద భీమా పోస్టల్ బాండ్ ద్వారా వచ్చిన ఇన్సూరెన్స్ బాండ్ ను బాధిత కుటుంబానికి ప్రణవ్ చేతుల మీదుగా అందజేశారు.రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కుటుంబానికి పెద్ద దిక్కులా ప్రణవ్ వ్యవహరించడం అడిగిన వెంటనే యూనియన్ లో ఉన్న సభ్యులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టడం ద్వారా ఒక కుటుంబానికి న్యాయం జరిగిందని భావోద్వేగానికి లోనయ్యారు.అలాగే హుజురాబాద్ పట్టణంలోని వివిధ పాఠశాలలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని,విద్యార్థులకు ప్రణవ్ చేతుల మీదుగా సన్మానం చేశారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ఇలా అందరినీ ఒకే చోట కలవడం సంతోషంగా ఉందని విద్య,వైద్య విషయంలో ముందు ఉంటామని తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, ప్రధాన కార్యదర్శి రవీందర్,హుజురాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు,మహిళ అధ్యక్షురాల్లు, జర్నలిస్టులు, సీనియర్ నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.