జహీరాబాద్‌కే బుల్లెట్ ట్రైన్ కేటాయించాలి.. అలైన్మెంట్ మార్చడంపై అఖిలపక్ష నేతల తీవ్ర ఆగ్రహం!

పయనించే సూర్యుడు,జూన్ 14 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ డీపీఆర్ ని జహీరాబాద్ నుండి వికారాబాద్ కు మార్చడాన్ని తీవ్రంగా నిరసిస్తూ జహీరాబాద్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం సీపీఐ సిపిఎం ఎంజేపీ టిఆర్పి సహా అన్ని రాజకీయ పార్టీల అఖిలపక్ష నాయకులు ఉద్యోగ సంఘాలు మేధావులు వ్యాపార సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులతో భారీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు వివిధ పార్టీల ముఖ్య నాయకులు పాల్గొని మాట్లాడుతూ జహీరాబాద్ ప్రాంతానికి రావలసిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ ను అన్యాయంగా వికారాబాద్ కు మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ నిర్ణయం వల్ల జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బుల్లెట్ ట్రైన్ ను తిరిగి జహీరాబాద్ కే మంజూరు చేసే వరకు అందరం సంఘటితంగా ఉమ్మడిగా ఉద్యమిస్తామని దీనిపై త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు జహీరాబాద్ ప్రజల పక్షాన సేకరించిన సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని జహీరాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ కు అందజేసి తమ నిరసనను తెలియజేశారు.