జహీరాబాద్ చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా అర్జున్ బండారి ఏకగ్రీవ ఎన్నిక: హర్షం వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు పూల సంతోష్

పయనించే సూర్యుడు, జూలై 4 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చేనేత సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా జహీరాబాద్ చేనేత సహకార సంఘంపై భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేయడం పట్ల భారతీయ జనతా పార్టీ జహీరాబాద్ పట్టణ అధ్యక్షుడు పూల సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు సుదీర్ బండారి తండ్రి అర్జున్ బండారి చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఎంతో ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. జహీరాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఖాతాలో మరో అద్భుతమైన విజయాన్ని నమోదు చేయడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘం అధ్యక్షుడు అర్జున్ బండారికి పూల సంతోష్ తన హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆయన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ స్థానిక చేనేత కార్మికుల సంక్షేమం మరియు వారి సమస్యల పరిష్కారం కోసం మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని అలాగే విజయవంతమైన పదవీకాలాన్ని పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పూల సంతోష్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు