జాతర ఏర్పాట్లను పరిశీలించిన సిరిసిల్ల రూరల్ సి ఐ.

పయనించే సూర్యుడు న్యూస్ :మే /26:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ గ్రామం లోని కందివారి ఆడబిడ్డ రేణుక ఎల్లమ్మ మహా జాతర ఈ మే నెల :27/ 28 తేదీలలో ఉండగా సోమవారం నాడు సిరిసిల్ల రూరల్ సి ఐ నాగేశ్వర్ రావు స్థానిక ఎస్ ఐ అశోక్ తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సి ఐ మాట్లాడుతూ జాతరలో బండ్లు తిరిగే సందర్భంలో డ్రైవర్లు మద్యం సేవించి ట్రాక్టర్లు నడపరాదని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు భక్తులందరూ పోలీస్ సిబ్బందికి సహకరించాలని కోరారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినచో వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ ఐ అశోక్ టెంపుల్ నిర్వాహకులు కంది రాజిరెడ్డి,కంది శ్రీనివాస్ రెడ్డి, కంది లింగ రెడ్డి, గుర్రం వెంకట్రామిరెడ్డి, గుర్రం లక్ష్మారెడ్డి, కంది బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.