జాయింట్ సర్వే పై అధికారులతో సమీక్షించిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 04.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// ఫారెస్టు రెవెన్యూ భూములకు సంబంధించిన జాయింట్ సర్వే పై మండల అధికారులతో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సమీక్షించారు బుధవారం స్థానిక మండల పరిపాలన భవనంలోని తహసిల్దార్ కార్యాలయంలో అధికారులతో ఆమె జాయింట్ సర్వేపై కూలంకుశంగా చర్చించారు ప్రత్యక్షేత్రం బోయకొండ పరిసర ప్రాంతంలో గల పుంగనూరు చౌడేపల్లి నిమ్మనపల్లి అధికారులతో బఫర్ జోన్ గురించి ఒక్కొక్కరిగా సమీక్ష నిర్వహించారు ఫారెస్ట్ మైనింగ్ రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకొని శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి సుబ్బరాజు ఫారెస్ట్ రేంజ్ అధికారి థామస్ సెక్షన్ ఆఫీసర్ అనిల్ కుమార్ చౌడేపల్లి పుంగనూరు తహసిల్దార్లు పార్వతి రాము రెవిన్యూ ఫారెస్టు మైనింగ్ అధికారులు పాల్గొన్నారు