జిడిపి కట్టా పనుల్లో కాసులకి కకృతి పడిన ఇంజనీర్లు నాణ్యత పాటించక నాసిరకం నిర్మాణాలు

★ కృంగిపోయి ప్రమాదకరంగా మారిన గాజులదిన్నె ప్రాజెక్టు కట్ట ★ నాసిరకం నిర్మాణాలతో దిగువన ఉన్న గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు ★ ప్రాజెక్టుకు నాసిరక మట్టి కట్టను నిర్మించిన కాంట్రాక్టర్లు, ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలి ★ బి.గిడ్డయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి

పయనించే సూర్యుడు న్యూస్ మే 28, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ గోనెగండ్ల గాజులదిన్నె ప్రాజెక్టు (సంజీవయ్య సాగర్) ను సిపిఐ జిల్లా బృందం ఈరోజు పరిశీలించింది. ఈ బృందంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ఏ.పీ. రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంపన్న గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు జి .రంగన్న, భాస్కర్, స్థానిక సిపిఐ మండల కార్యదర్శి శ్రీరాములు రైతు సంఘం నాయకులు మదిలేటి నాయుడుతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ 25 వేల ఎకరాలకు పైగా సాగునీరు, అనేక గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చే జల జీవనాడైన గాజులదిన్నె ప్రాజెక్టు ప్రమాదకర స్థితిలో ఉండడం ఆందోళన కలిగిస్తున్నదని 4.5 టీఎంసీల సామర్థ్యం నుండి 5.5 టిఎం సిల సామర్థ్యం పెంపులో భాగంగా కాంట్రాక్టర్లు చేసిన పనులలో నాణ్యత ప్రమాణాలు లోపించడంతో పర్యవేక్షణ చేయాల్సిన ఇంజనీరింగ్ అధికారులు గాలికి వదిలేయడంతో ప్రాజెక్టుకు ప్రధాన ఆనకట్ట మట్టి కట్ట కుంగిపోయిందని, ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తడానికి అవకాశం లేకుండా ఉండిపోయాయని, ప్రస్తుతం ప్రాజెక్టు చాలా ప్రమాదంలో ఉందని ప్రభుత్వాలు ఇంజనీరింగ్ ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతులు ఆందోళన చెందుతున్నారని, కాంట్రాక్టులు లాభాల ఆశతో నాసిరంగంగా, నాణ్యత లోపంతో మట్టి పనులు చేశారని, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాసులకు కమిషనర్లకు కక్కుర్తి పడి ఇంజనీర్లు పర్యవేక్షణ చేయకపోవడంతో తక్కువ సమయంలోనే పనులు జరిగిన చోట కట్ట కుంగిపోయి ప్రమాదకరంగా మారిందని, ఇటీవల కాలంలో కట్ట కుంగిపోయిన చోట ప్రమాదవశాత్తు ఇద్దరు మనుషులు కూడా మరణించారని, కాసులకు కక్కుర్తి పడి పర్యవేక్షణ చేయని ఇంజనీర్లపైన నాణ్యత లోపాలతో పనిచేసిన కాంట్రాక్టు పైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులపై చర్యలు తీసుకోవాలని తీవ్రస్థాయిలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బి.గిడ్డయ్య మాట్లాడుతూ జిల్లాల పునర్వీజన తర్వాత కర్నూలు జిల్లాకు మిగిలిన ఏకైక అతిపెద్ద ప్రాజెక్టు గాజులదిన్నె ప్రాజెక్ట్ అని అలాంటి ప్రాజెక్టు కు నేడు ముప్పు పొంచి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ద్వారా గోనెగండ్ల, కోడుమూరు, క్రిష్ణగిరి, దేవరకొండ, పత్తికొండ, డోన్ మండలాల కు సాగునీరు, త్రాగునీరు అందించడంతోపాటు 125 గ్రామాలకు తాగునీరు ను, ఈ ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువల ద్వారా రబీ పంటలకు 24,372 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని అయితే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 4.5 టీఎంసీల నుండి 5.5 టీఎంసీలు (1 టీఎంసీ పెంచడానికి) 2019-24 గత వైసీపీ ప్రభుత్వంలో ఆనకట్ట బలోపేతం, ఎత్తు పెంచడం వంటి పనులకు 60 కోట్లు రూపాయల నిధులను విడుదల చేయడం జరిగిందని అయితే కాసులకు కక్కుర్తి పడిన కాంట్రాక్టర్లు నాసిరకంగా ఆనకట్ట పనులు చేసి చేతులు దులుపుకోవడంతో ఎక్కడపడితే అక్కడ కోతకు గురై ఆనకట్టు కృంగిపోవడం వలన రానున్న కాలంలో భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టు తెగిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. అదేవిధంగా 12 కోట్ల రూపాయలతో గేట్లు అధునీకరణ పనులకు కేటాయించడం జరిగిందని అయితే పూర్తిస్థాయిలో గేట్లను అమర్చుకుండా వదిలేయడం జరిగిందని ఒకవేళ భారీ వర్షాలకు ప్రాజెక్ట్ నిండితే గేట్లు ఎత్తడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉందని, ఇప్పటికైనా పాలకులు స్పందించి కోతకు గురైన ప్రాంతంలో మరోసారి నాణ్యతతో మట్టి చేయించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోనున్నట్లు ఆయన తెలియజేస్తూ, అవసరమైతే ప్రాజెక్టు పరిరక్షణ కోసం సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు మద్దిలేటి నాయుడు సిపిఐ మండల కార్యదర్శి శ్రీరాములు, మండల సహాయ కార్యదర్శి శివ రామాంజని, ఏఐటీయూసీ తాలూకా డిప్యూటీ సెక్రటరీ గణేష్, రైతు సంఘం నాయకులు మాలిక్,యూనుస్, నాగప్ప,జయరామ్, నల్లారెడ్డి, మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు భూములు ముప్పుకు గురైన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి గాజులదిన్నె ప్రాజెక్ట్ 1 టిఎంసి ఎత్తు పెంచడంతో ఐరన్ బండ, ఏనేకండ్ల, గోనెగండ్ల గ్రామాలలో 500 ఎకరాలకు పైగా పట్టా భూములు మోప్పుకు గురవుతున్నాయని ఈ రైతులకు తక్షణమే భూసేకరణ చట్టంలోని అంశాలన్నిటిని వర్తింపచేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.