పయనించే సూర్యుడు మే 29 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) తెలంగాణ ప్రభుత్వము జిల్లా కలెక్టర్ మరియుజిల్లా వ్యవసాయ అధికారి ఆదేశానుసారము ఈరోజు పెద్ద శంకరపేట్ మండలంలో మండల టాస్క్ఫోర్స్ టీం ఎరువుల దుకాణాలను మన గ్రోమోర్ జగదాంబ మరియు ఇతర దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది దీనిలో భాగంగా మండల తహసిల్దార్ మండల వ్యవసాయ అధికారి మరియు ఏఎస్ఐ తనిఖీ చేసి తప్పకుండా ఎరువుల లైసెన్సులు లైసెన్సులు కలిగి ఉండాలని లైసెన్సుల చివరి తేదీ రాకముందే రెన్యువల్ చేసుకోవాలని హెచ్చరించడం అయినది ఎరువులు పక్కదారి పట్టకుండా రైతులకు సరైన క్రమంలో అమ్మకాలు జరపాలని సూచనలు ఇవ్వడం జరిగింది ఎరువుల సరుకు నిలువ( స్టాక్) రిజిస్టర్లు అనగా యూరియా డి ఏ పి కాంప్లెక్స్ పొటాష్ తదితర ఎరువుల రిజిస్టర్లు తేదీ వారిగా తప్పకుండా నమోదు చేయాలని అలాగే ఈపాస్ మెషిన్ లో స్టాక్ ఎప్పటికప్పుడు క్లియరెన్స్ చేయాలని తహసిల్దార్ ప్రభుదాస్ చెప్పడం జరిగింది ఎలాంటి బ్లాక్ మార్కెటింగ్ గాని ఎరువుల డైవర్స్ కేసర్ గాని అధిక ధరలకు విక్రయించడం జరిగినచో ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ మరియు ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారము వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామనీ ఏఎస్ఐ వివరించడం జరిగింది స్టాక్ బోర్డులో ఎప్పటికప్పుడు వివరాలు పొందుపరచాలని హెచ్చరించడం జరిగింది రైతులకు యూరియా సరఫరా లో బిల్లులు తప్పనిసరిగా రైతులకు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది యూరియా డిఏపి కాంప్లెక్స్ పొటాష్ ఎరువులు సరైన విధానంలో గాలి వెలుతురు సక్రమంగా ఉన్న గోడౌన్లలో నిల్వ ఉంచి వాటి నాణ్యత పాడవకుండా చూసి రైతులకు సరఫరా చేయాలని మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ సూచించారు