జిల్లా కలెక్టర్ కె. హైమావతి మర్కుక్ మండల కేంద్రంలో నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించారు.

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ జూన్ 16 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం పరిధిలోని మార్కుక్ మండల కేందమైన లో నూతన ప్రభుత్వం పాఠశాల ప్రారంభోత్సనికి జిల్లా కలెక్టర్ కె హైమావతి జిల్లా విద్య అధికారి హాజరై ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి వరగంటి శాస్త్రి తో కలిసి అన్ని క్లాస్ రూమ్ లను, మౌలిక వసతులను పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడం అది ఇండ్లలోకి సురక్షితంగా చేరవేయడానికి 4 బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు సెక్షన్లలో 100 ప్రీఫైనరీ స్కూల్ విద్యార్థులు, 1 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు ప్రతి క్లాస్కు 40 మంది చొప్పున 320 మంది విద్యార్థులు మొత్తం 420 మంది విద్యార్థులతో ఈరోజు పాఠశాలను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. వచ్చే సంవత్సరం నుండి రెండవ సెక్షన్లలో కూడా విద్యార్థులు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించినప్పుడే అక్కడి నుండే మార్కుక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించారనీ ఈరోజు నుంచి తరగతులు ప్రారంభమయ్యాయనీ గతంలో పోలీస్ వారి క్వాటర్స్ కోసం ఉపయోగించిన ఈ భవనాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం ఉపయోగిస్తున్నామనీ శాశ్వత భవనాల నిర్మాణానికి 16 కోట్ల 62 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయనీ వాటితో పాఠశాల భవనం నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, స్థానిక మండల స్థాయి అధికారులు, విద్యార్థుల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.