జిల్లా కాంగ్రెస్ మైనార్టీ కమిటీ చైర్మన్, టేక్మాల్ మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు షేక్ మజ్జార్ కి జన్మదిన శుభాకాంక్షలు!!

జనం న్యూస్ 7/మే టేక్మాల్ రిపోర్టర్ సమాజ సేవే లక్ష్యంగా, ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలిచే నాయకుడు షేక్ మజ్జార్ టేక్మాల్ మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ సభ్యులు, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్‌గా ఆయన చేస్తున్న సేవలు అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహ ప్రియ శిష్యుడు షేక్ మజ్జార్ అని చెప్పక తప్పదు. పదవి కోసం కాదు, ప్రజల కోసం పనిచేసే నైజం ఆయనది. సబ్బండ వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో,వారికి న్యాయం జరిగేలా కృషి చేయడంలో ఎప్పుడూ ముందుంటారు.పేదలకు సాయం చేయడం, విద్య, ఉపాధి అవకాశాల కోసం కృషి చేయడం ఆయన ప్రత్యేకత. రాజకీయాల్లోనూ, సామాజిక సేవలోనూ సమన్వయం పాటిస్తూ, అందరినీ కలుపుకుపోయే గుణం మజ్జార్ ను ప్రత్యేకత. యువతకు ఆదర్శంగా నిలుస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ పుట్టినరోజున మజ్జార్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేసే శక్తిని అల్లాహ్ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీ నాయకత్వం జిల్లా అభివృద్ధికి, సామాజిక సౌభ్రాతృత్వానికి మరింత దోహదపడాలని ఆశిస్తూ… షేక్ మజ్జార్ జన్మదిన శుభాకాంక్షలు!