పయనించే సూర్యుడు మే 30 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోని పట్టణములోని జెబి గార్డెన్ లో జరిగిన కర్నూలు జిల్లా కార్యవర్గ కార్యశాల జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పర్యవేక్షణలో గుణంగా నిర్విహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ,బిజెవైయం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి పాల్గొన్నారు.అక్కమతోట రామకృష్ణ అధ్యక్షోపన్యాసము అనంతరం ముఖ్య అతిథులు సునీల్ రెడ్డి , ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ప్రసంగించారు.ఈ సందర్భంగా డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సాధిస్తున్న విజయాలతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద మధ్యతరగతి ప్రజలకు ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది.అంతేకాకుండా గత వైసిపి ప్రభుత్వములో జగనన్న కాలనీలో జరిగిన అవినీతిపై పోరాట ఫలితమే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు రైతులను కలిసి రిపోర్టు తయారు చేయడమే కాకుండా జగనన్న కాలనీలో అవినీతి జరిగిందని, పూర్తి విచారణ జరిపితే మరికొన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని అలాగే ఆదోని నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాలలో రోడ్లు డ్రైనేజీలు 25కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని ఆదోని మున్సిపాలిటీ పరిధిలో కూడా వివిధ వార్డులలో 13 కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, మొన్నటికి మొన్న ధనాపురం నుండి హొలగుంద వరకు 7 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది, పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు.అలాగే నిరుద్యోగ యువతకు ఉధ్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం 10 ఎకరాల భూమిని కేటాయించి ఎమ్ ఎస్ ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడంతో పాటుగా నిరుద్యోగులకు వాళ్ళు ఏర్పాటు చేసే ఫ్యాక్టరీలను బట్టి స్థలాలను కేటాయించడం కోసం వినతులు కూడా తీసుకోవడం జరుగుతోందని వివరించారు.అనంతరం మాజీ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ దంపతులు ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి ని గజమాలతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమములో అమరావతి నగర్ 35వ బూత్ ఇంచార్జీలు శ్రీమతి నూర్జహాన్, పరుశురాం,వీరేష్, చరణ్, లోకేష్ పాల్గొన్నారు