జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

ఎన్టీ రామారావు కి భారతరత్న ఇవ్వాలి గుడిసె ఆది కృష్ణమ్మ, జిల్లా టిడిపి నాయకుల డిమాండ్.

పయనించే సూర్యుడు మే 29 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పార్లమెంటు అధ్యక్షురాలు శ్రీమతి గుడి కృష్ణమ్మ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 103వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరు కాగా పార్టీకి చెందిన వివిద స్థాయిల నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరు కాగా ముందుగా పార్టీ కార్యాలయం ఆవరణ యందు, కార్యాలయంలోనూ కీర్తిశేషులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కేకును కట్ చేసి ఒకరికొకరు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు తరువాత జిల్లా పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు చేరుకొని అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఒక వ్యక్తి కాదు ఒక శక్తిని వారు 1983 వరకు తెలుగు చలనచిత్ర రంగంలో మా కుటుంబం లేని కథానాయకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిష్థితిని దృష్టిలో ఉంచుకొని ఆనాడు రాష్ట్రంలోని కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ కాంగ్రెస్ వారికి పాదాక్రాంతులై పదవుల కోసం వెంపర్లాడు తున్నారు వారి దయాదాక్షిన్యాలతో రాష్ట్రంలో పాలన కొనసాగిస్తూ తోచిన కాడికి వారు రాష్ట్ర ఖజానాను సమూలంగా దోచేసి రాష్ట్ర ప్రజలను గాలికి వదిలేశారు ఇలాంటి సమయంలో తెలుగు వారి ఆత్మ గౌరవం నినాదంతో ఎన్టీ రామారావు 1982 మార్చ్29న తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల పాటు రాష్ట్రంలో కలియతిరిగి 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పేకలించి వేశారని, మొట్టమొదట కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రజల సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారని ఆనాడు రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నిజాయితీపరుడైన నాయకుడు పేదవాడి కోసం బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని అలాంటి మహనీయుని వల్ల ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు అత్యున్నత పదవులను పొందేందుకు ఎన్టీఆర్ మార్గదర్శకులుగా నిలిచారని వారు ఆనాడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళుగా భావించి ఆ నిరుపేద దేవుళ్లకు కూడు, గూడు,గుడ్డ , అనే మూడింటిని ప్రజలకు అందించారు.పట్టెడన్నం పెట్టేందుకు రెండు రూపాయలకు కిలో బియ్యం ఉండేందుకు గూడు అక్క గృహము, కట్టుకునేందుకు గుడ్డ జనతా వస్త్రాలను అందించి పేదలపాలికి దేవుడయ్యారని గుర్తు చేశారు. ఆనాడు మహిళలకు సమాజంలో సమాన స్థానం కల్పించాలని ఉద్దేశంతో మహిళలకు సమాన హక్కు రిజర్వేషన్లను అమలు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్ . అలాంటి మహనీయునికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతరత్న ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ అడుగుజాడల్లో పార్టీని ముందుకు తీసుకొని వెళుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని నారా లోకేష్ మహిళల కోసం రానున్న ఎన్నికల్లో మహిళా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన పొందకపోయినా 33% రిజర్వేషన్లను రాష్ట్రంలో అమలు జరిపే ప్రయత్నంలో భాగంగా మహిళలకు స్థానం కల్పించనున్నట్లు తెలియజేశారని , గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మహానాడు సందర్భంగా నారా లోకేష్ తెలియజేసినందుకు ఈ సందర్భంగా వారికి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేయ జరిగింది ఈరోజు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకొనుచున్న ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.