జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాలూరలో బడిబాట కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ మే 20 సాలూర : పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాలూర గ్రామంలో గల పెద్ద చెరువు ఉపాధి హామీ పథక లబ్ధిదారుల దగ్గర బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది . కార్యక్రమంలో ఉపాధి కూలీలందరికీ కరపత్రాలు పంచి ప్రధానోపాధ్యాయురాలు రాజీ మంజూష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటుగా యోగ కరాటే నేర్పిస్తున్నాం అగ్రికల్చర్ వేకేషనల్ ఐటి కంప్యూటర్ లాంటి కోర్సులతో మా విద్యార్థి అన్ని రంగలలో అభివృద్ధి చెందుతారు అని తేలియజేశారు. పాఠశాలలో లభిస్తున్న ప్రభుత్వ పథకాలను తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఉచిత పుస్తకాలు నోటుబుక్స్ రేండు జతల దుస్తులు, మద్యాహ్న భోజనం 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థుల కు స్కాలర్ షిప్ ద్వారా లబ్ది పోందవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విఠల్ కాంబ్లే ఫీల్డ్ అసిస్టెంట్ సయ్యద్ ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.