పయనించే సూర్యుడు న్యూస్ మే 29 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటీవల మే 23, 24 తేదీలలో నిర్వ హించిన జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మిం టన్ పోటీలలో అశ్వారావుపేట ఫైర్ కాలనీకి చెందిన మాచవరపు హోసన్న అద్భుత ప్రతిభ కనబర్చాడు. ఈ పోటీలలో ఆయన డబుల్స్ విభాగంలో ప్రథమ స్థానాన్ని, అలాగే సింగిల్స్ విభాగంలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ఘన విజయం సాధించడమే కాకుండా, రాష్ట్ర స్థాయి పోటీ లకు అర్హత సాధించడం పట్ల జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు దండు శ్రీనివాసరాజు హర్షం వ్యక్తం చేశారు. కాగా హోసన్న సీనియర్ షటిల్ క్రీడాకారుడు ప్రసాద్ కుమారుడు కావడం విశేషం. రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా రాణించి అశ్వారావుపేట ప్రాంతానికి మరిన్ని విజయాలు అందించాలని స్థానికులు క్రీడా అభిమానులు హోసన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.