
పయనించే సూర్యుడు నవంబర్ 2అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల ప్రతినిధి.పి వి వి స్ గుప్త జి.మాడుగుల: ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రం జి.మాడుగులలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జి.మాడుగుల సీఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఎస్ఐ సాయిరాం పడాల్, పోలీసు సిబ్బంది, ఏపీఎస్పీ బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని ఈ సందర్భంగా చాటి చెప్పారు. ప్రజల్లో భద్రతా భావం కల్పించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు