పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీకాలనీ-21 జూనియర్ ఉద్యోగులు సీనియర్ ఉద్యోగుల నుంచి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలనీ రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ అన్నారు.సింగరేణి వ్యాప్తంగా నిర్వహిస్తునటువంటి మల్టీ డిపార్ట్మెంటల్ సమావేశాలలో భాగంగా ఆర్జీ-3 ఏరియాలోని ఓ.సి.పి-1 ఉపరితల గని లోని బేస్ వర్క్ షాప్ విభాగం నందు బుధవారం మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం నిర్వహించారు.ఈ సంధర్భంగా జి.యం మాట్లాడుతూ యంత్రాలను పూర్తి స్థాయి లో వినియోగించి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడంతో పాటు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, అంకిత భావం, సమిష్టి కృషితో అందరం భద్రతతో విధులు నిర్వహిస్తూ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని, సీనియర్ ఉద్యోగుల నుంచి జూనియర్ ఉద్యోగులు వృత్తి నైపుణ్యాన్ని నేర్చుకోవాలని, యంత్రాలలో ఆయిల్ లీకేజీలు కాకుండా చూడాలని, టెక్నిషియన్స్ యంత్రాలకు డాక్టర్ల లాంటి వారని, యంత్రాలకు చిన్న మరమ్మతులు ఉన్న వాటిని త్వరగా పూర్తిచేసి అందుబాటులో ఉంచాలని అన్నారు.ఈ సమావేశంలో భాగంగా సింగరేణి సాధిస్తున్నటువంటి ప్రగతి, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడానికి చేసినటువంటి ప్రణాళికల గురించి సంబంధిత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. దీనిలో భాగంగా సంస్థ అభివృద్ధికి సంబంధించి పలువురు ఉద్యోగులు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలను సంబంధిత అధికారులు స్వీకరించారు. కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు వై.వి.రావు, కోట రవీందర్ రెడ్డి, ఏరియా ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ఎస్వోటు జిఎంలు బి.వి. సత్య నారాయణ, బండి సత్య నారాయణ, ఐఈ విభాగం అధికారి ప్రవీణ్, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ్ వి ఫ్యాటింగ్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉదయ్ భాస్కర్, సీహెచ్పి డిజియం కాశీ విశ్వేశ్వరరావు, మేనేజర్ ఆర్.పాపయ్య, డివైపియం వి.సునీల్ ప్రసాద్, పిట్ సెక్రెటరీలు, ఇతర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.