పయనించే సూర్యుడు: మే: 21/26 సత్తుపల్లి: రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ భవాని కంటి హాస్పిటల్ నందు డాక్టర్ రేగళ్ల నరేష్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ మరియు వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు… బ్లడ్ డొనేట్ చేసిన ఎన్టీఆర్ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసి సర్టిఫికెట్ అందించడం జరిగింది… అనంతరం హాస్పిటల్ యాజమాన్యం మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు గౌరవ మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ నీ , వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి ని, కౌన్సిలర్ ఉబ్బన రాంబాబు ని శాలువాలతో సత్కరించారు