జూన్ 19న జరిగే కిసాన్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి- జిల్లా వ్యవసాయ అధికారి

జనం న్యూస్ జూన్ 7 చిట్యాల మండల ప్రతినిధి జయశంకర్ జిల్లా భూపాలపల్లి లోని అంబేద్కర్ స్టేడియంలో జూన్ 19న నిర్వహించే కిసాన్ మేళా కార్యక్రమానికి జిల్లాలోని వెయ్యి మంది రైతులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జే. బాబురావు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారులు చేపట్టబోయే కార్యక్రమాల గురించి జిల్లా శాస్త్రవేత్తల తోటి చర్చలు జరిపి గోష్టి వర్షాలు సకాలంలో పడిన ఎడల వ్యవసాయ శాఖ నిర్దేశించినటువంటి వరి సన్న రకాలను సాగు చేయాలని ఒకవేళ ఎలినో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినట్లయితే ప్రత్యామ్నాయ పంటలు రైతులు సాగు చేయుటకు చేపట్టబోయే కార్యక్రమాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమంలో జరుగుతుందని కాబట్టి జిల్లాలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కిసాన్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.