జూన్ 5న గూడూరు తాలూకాఎన్నికలు.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 3 గూడూరు తాలూకా ఏపీ జి ఈ ఏ ఎన్నికలు జూన్ 5న చెన్నూరులో నిర్వహిస్తామని రాపూర్ తాలూకా ఏపీ జి ఈ ఏ అధ్యక్షుడు, గూడూరు తాలూకా ఎన్నికల అధికారి జే. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చెన్నూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని అదే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని, సభ్యులందరూ సమావేశానికి హాజరై ఆయా కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట ఏపీ జి ఈ ఏ నాయకులు శేఖర్ మస్తానయ్య తదితరులు ఉన్నారు.