పయనించే సూర్యుడు జూన్ 4 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తారీకు వరకు కళాశాలలో ప్రవేశాలు తీసుకోవాలని డిండి ఆర్ పి ఆర్ పి ప్రిన్సిపాల్ వై. శిరీష బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రవేశ పరీక్ష ఫలితాలు ప్రకటించినందున సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో విద్యార్థులు కళాశాలలో చేరాలన్నారు.