పయనించే సూర్యుడు-21-05-2026-రాజంపేట న్యూస్ : యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు మరియు వారికి సరైన వేదికను కల్పించేందుకు టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇంచార్జి చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా "జె ఎం ఆర్ మెగా క్రికెట్ టోర్నమెంట్" ను నిర్వహిస్తున్నారు. ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన గోడ పత్రాలు బుధవారం రాజంపేటలో జగన్మోహన్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని యువత క్రీడల్లోనూ రాణించాలని, క్రమశిక్షణ, పట్టుదలతో ఆడి టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్‌ను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి మరియు శ్రీనివాస్ రాజు స్వీకరించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మ్యాచ్‌లను పారదర్శకంగా మరియు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికి ఈ టోర్నమెంట్ ఒక చక్కని అవకాశమని, భారీ బహుమతులతో కూడిన ఈ పోటీల్లో జట్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అద్దేపల్లి ప్రతాప్ రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ఇడిమడకల కుమార్, ఏఎంసీ చైర్మన్ గన్నె సుబ్బ నరసయ్య, ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, టీడీపీ రాజంపేట టౌన్ అధ్యక్షుడు దగ్గుబాటి సుబ్రహ్మణ్యం నాయుడు, సింగిల్ విండో డైరెక్టర్ పరశురాం, కౌన్సిలర్ రాజేష్, యూనిట్ ఇంచార్జ్ మహమ్మద్ అలీ, సర్పంచ్ హరి, హస్తవరం గ్రామానికి శివరామరాజు తదితరులు పాల్గొన్నారు.