జె.వి.వి. ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్ చైర్, వాకర్ పంపిణీ.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 9 గూడూరు లోని విశ్రాంత ఉద్యోగుల భవనం నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పవన్ సాయి పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి సుబ్రహ్మణ్యం దాతృత్వం లో ఇద్దరు దివ్యాంగులకు వీల్ చైర్ మరియు వాకర్ బహుకరించడం జరిగింది. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మా కుమారుని పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి ఇంట్లో ఘనంగా జరుపుకోవడం కన్నా జనవిజ్ఞాన వేదిక వారు చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు చూసి స్ఫూర్తి పొంది వారి ద్వారా ఇద్దరు దివ్యాంగులకి చేయూతగా నిలవాలని వీల్ చైర్, వాకర్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, సేవ చేసే అవకాశం మాకు కల్పించిన జే.వి.వి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జె.వి.వి. వారితో కలసి అనేక మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, పవన్ సాయి, చెంచునారాయణ, పురుషోత్తమ రావు, సుబ్బారావు, ప్రభాకర్, శ్రీనివాసాచారి, రజనీకాంత్, లవకుమార్, పసల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.