జె.వి.వి.లో సభ్యులుగా చేరండి. గోడ పత్రికలు ఆవిష్కరణ.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 14 జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్థానిక సి.వి.సి పార్క్ నందు జే.వి.వి లో సభ్యులుగా చేరండి అను గోడ పత్రికలను జే వి వి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జే.వి.వి. అధ్యక్షులు వేగూరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 38 సంవత్సరాలనుండి శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం , మూఢ నమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తుందని ప్లాస్టిక్ ను నిషేధించాలని మరియు విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించడానికి చకుముకి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు విద్యార్థులు జే.వి.వి లో భాగస్వాములు కావాలని మంచి సమాజం కోసం అందరం కష్టపడదామని కోరారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్రప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, సుబ్బారావు, ప్రభాకర్, ఆనంద్, శ్రీనివాసాచారి, సురేష్, పసల వెంకటేశ్వర్లు, మనోభిరామ్ తదితరులు పాల్గొన్నారు.