జే.వి.వి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మానం.

పయనించే సూర్యుడు గూడూరు న్యూస్ జూన్ 6 జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత నెల రోజుల నుంచి వేసవి లో విజ్ఞాన కార్యక్రమం లో భాగంగా చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ హైస్కూల్ నందు జరుగుతున్న ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ మరియు మ్యాథ్స్ శుక్రవారం తో ముగియనున్న సందర్భముగా నెలరోజుల పాటు క్లాసులు చెప్పినటువంటి టీచర్లు నరేంద్రనాథ్ చౌదరి, సునీల్ రాజ్, శంకరయ్య ను ముఖ్య అతిథి డిప్యూటీ డిఇఓ సనత్ కుమార్ చేతుల మీదుగా శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించడమైనది. ఈ సందర్భంగా డిప్యూటీ డిఇఓ సనత్ కుమార్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక వారు ఈ వేసవి సెలవులలో విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సు మ్యాథ్స్ క్లాసులు నిర్వహించటం చాలా అభినందనీయమని విద్యార్థుల భవిష్యత్ కొరకు తోడ్పాటు అందిస్తున్న జే.వి.వి సభ్యులందరినీ అభినందిస్తున్నానని ఇలాంటి క్లాసులు ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరారు. క్లాసులకు వచ్చే విద్యార్థిని, విద్యార్థులకు ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్, చిక్కీలు, అరటిపండు, బిస్కెట్స్ తో పాటుగా నోట్ బుక్స్, పెన్ లు ఉచితంగా ఇవ్వడం ఎక్కడా జరగదని అది ఒక్క గూడూరు జనవిజ్ఞాన వేదిక వారు మాత్రమే చేసినందుకు వారిని అభినందిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్, నాగరాజు, రామమోహన్, పురుషోత్తమరావు, ఆనంద్ ,సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, పీ.వీ.కే శర్మ, మనోహర్ గౌడ్, ఉపాధ్యాయులు నరేంద్రనాథ్ చౌదరి, సునీల్ రాజ్, శంకరయ్య స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.