జైనూర్ మండలం భూషిమెట్ట గ్రామం లో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రజా అవగాహన కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్ జూలై 03/07/2026 కొమురం భీం అసిఫాబాద్ డిస్టిక్ జై నూర్ మండల్ రిపోర్టర్ వడ్డీ జనార్దన్ వార్త విశ్లేషణ :జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ గారీ ఆదేశాల మేరకు ఈరోజు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం భూషిమెట్ట గ్రామంలో ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం కళాకారులు వివిధ నాటకాలు, జానపద పాటలు, సందేశాత్మక ప్రదర్శనలు ద్వారా యువతకు, గ్రామ ప్రజలకు పలు సామాజిక అంశాలపై అవగాహన కలిగించారు. ముఖ్యంగా రోడ్డు భద్రతా నియమాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు, మహిళలు, పిల్లల భద్రత చట్టాలపై అవగాహన, పోలీస్ శాఖతో ప్రజల సహకారం వంటి అంశాలను కళాత్మకంగా వివరించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళబృందం సభ్యులు రోహిత్, రాంచందర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, రజిత, సంఘవి జైనూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ విక్రమ్ మరియు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.