జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ ఐఏఎస్, ఆకస్మిక క్షేత్ర స్థాయి పరిశీలన

లింగంపల్లి అండర్‌పాస్, మోడల్ రోడ్,బొటానికల్ గార్డెన్ ఫుట్‌పాత్ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన

పయనించే సూర్యుడు,జూలై 03 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎన్కుమార్ ఈరోజు లింగంపల్లి అండర్‌పాస్ వద్ద నీటి నిలుపుదల ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడమైనది. అనం తరం ప్రతిపాదిత మోడల్ రోడ్ అభివృద్ధి పనులు, బొటానికల్ గార్డెన్ వద్ద ఫుట్‌పాత్ ప్రాంతాలను కూడా సందర్శిం చడం జరిగింది. ఈ పర్యటనలో ప్రధానంగా ప్రస్తుత మౌలిక సదుపాయాల స్థితిని అంచనా వేయడం, మెరుగుపరచాల్సిన ప్రాంతా లను గుర్తించడం, ప్రజా సౌకర్యాలు, రహదారి భద్రత మరియు పట్టణ సౌందర్యాన్ని పెంపొందించేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంపై దృష్టి సారించడమైనది. లింగంపల్లి అండర్‌పాస్ వద్ద వర్షాకా లంలో ఏర్పడే నీటి నిలుపుదల సమ స్య కు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించడమైనది.మోడల్ రోడ్‌ను అంత ర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు, బొటానికల్ గార్డెన్ వద్ద పాదచారులకు సౌకర్యవంతమైన ఫుట్‌పాత్‌లు ఏర్పా టు చేసేందుకు సూచనలు ఇవ్వడశ మైనది. సంబంధిత అధికారులకు ప్రతిపాదిత పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడమై నది. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టాలని సూచించడమైనది.