ఝరాసంగం ప్యాలవరం మరియు చిలెమామిడి గ్రామాలలో సిసి రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు

పయనించే సూర్యుడు, జూలై 3 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో అంతర్గత రహదారుల అభివృద్ధి కోసం మంజూరైన నిధులతో గురువారం సిసి రోడ్ల నిర్మాణ పనులను జహీరాబాద్ శాసనసభ్యుడు కొనింటి మాణిక్ రావు ఘనంగా ప్రారంభించారు. ఝరాసంగం మండల కేంద్రంతో పాటు ప్యాలవరం మరియు చిలెమామిడి గ్రామాలలో నూతనంగా నిర్మించనున్న ఈ సిసి రోడ్డు పనులకు భారత రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు బొగ్గల సంగమేశ్వర్ మరియు యువ నాయకుడు కొనింటి మిథున్ రాజ్ లతో కలిసి ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు జగదీష్, గ్రామ సర్పంచ్ వినోద బాలరాజ్, పట్టణ అధ్యక్షుడు ఎజాస్ బాబా, మాజీ ఉపసర్పంచ్ హమీద్ సాబ్, మమత అనిల్, ప్రకాష్, నవీన్, సంగమేశ్వర, తేజమ్మ, ప్రవీణ్, మండల పరిషత్ సభ్యుడు నాగన్న, సజ్జన్, ఫయాజ్, విలాస్, అజీమ్, విజయ్, బి సంగన్న, దత్తు, గోపాల్, అజర్ పాల్గొన్నారు. అలాగే ప్యాలవరం గ్రామ సర్పంచ్ నర్మదరాణి రాజ్ కుమార్, ఉపసర్పంచ్ రవి, మాజీ సర్పంచ్ బసవరాజ్, మాజీ ఉపసర్పంచ్ మాణిక్ యాదవ్, వార్డు సభ్యుడు శ్రీకృష్ణ, కార్యకర్తలు గాండ్ల సంగన్న, బస్వరాజ్, శిరోమణి, అంజన్న, మహేష్, లక్ష్మణ్, బక్కన్న, అంజన్న పాల్గొన్నారు. చిలెమామిడి గ్రామ సర్పంచ్ జైరాజ్, ఉపసర్పంచ్ రాచన్న, గోపాల కృష్ణ, రవి, సత్తార్ మియా, జర్నయ్య, అంజన్న, వసంత్, యేసు, నరేష్, ఆయా గ్రామాల ప్రజలు, భారత రాష్ట్ర సమితి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

.