టమోటా చెట్లు ధ్వంసం రూ. 3 లక్షల ఆస్తి నష్టం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 03.05.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// టమోటా చెట్లు ధ్వంసం చేసి రూ 3 లక్షల ఆస్తి నష్టం సంబంధించిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది బాధితురాలు కథనం మేరకు… మండలంలోని వెంగళపల్లి పంచాయతీ దాసరయ్య వారి పల్లి చందన అంజలి కి గ్రామానికి సమీపంలో పొలం ఉంది ఆ పొలంలో ఎకరా వరకు టమోటా పంట సాగులో ఉంది రెండు రోజుల్లో తొలి విడత టమోటా ను మార్కెట్కు తరలించాల్సి ఉంది అయితే గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి టమోటా పొలంలో మద్యం సేవించి పొలంలో ఉన్న 5 వేల టమాటా మొక్కలను ధ్వంసం చేశారని బాధితురాలు వాపోయింది ఆరుకాలం శ్రమించి దాదాపు రూ 1.5 లక్షల వరకు ఖర్చు చేసి మార్కెట్కు తరలించే సమయంలో ధ్వంసం చేశారని మహిళా రైతు వాపోయింది ఈ మేరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది