టిడిపి నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో

ఘనంగా జరిగిన మినీ మహానాడు

పయనించే సూర్యుడు మే29 ఆదోనిడివిజన్ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని నియోజకవర్గంలో టిడిపి ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది అలాగే మెట్రో ఫంక్షన్ హాల్లో ఆదోని టిడిపి ఇంచార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో క్లస్టర్-7 నాయకులు, కార్యకర్తలతో కలిసి నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, క్లస్టర్లు, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.