టిడ్కో లబ్ధిదారుల కష్టాల పైఏపీ టీఐడిసీఓఎండీ.. ని సంప్రదించిన యువనేత సంకా హరీష్!

ప్రజల పక్షాన నిలుస్తూ యువనేత సంకా హరీష్ టిడ్కో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల సమస్యలను ఏపీ టీఐడిసీఓఎండీ.ని దృష్టికి తీసుకెళ్లారు..

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 12 జగ్గయ్యపేట బలుసుపాడు రోడ్ టిడ్కో గృహాల పనులను త్వరగా పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు వీలైనంత త్వరగా ఇళ్లను అందజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారులకు వీలైనంత త్వరగా సొంత ఇళ్లు అందేలా సమస్యల పరిష్కార దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సంకా హరీష్ పేర్కొన్నారు. తమ సమస్యపై వెంటనే స్పందించి కృషి చేసిన యువనేత సంకా హరీష్ కి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.