టీడీపీ సభ్యత్వం సామాన్య కుటుంబాలకు అండ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర్ రెడ్డి

ఎమ్మెల్యే చేతుల మీద ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద భీమా ధృవపత్రాలు

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 07, 2026:గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ తెలుగుదేశం పార్టీ సామాన్యులకు భరోసా కల్పించే పార్టీ అనే విషయం మరోసారి నిరూపితమైంది. ఇటీవల ప్రమాదంలో మృతిచెందిన గోనెగండ్ల మండలం వీరంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గంగమ్మ, గోపాల్ సతీమణి గంగమ్మ మాదేవి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా నిధులు మంజూరయ్యాయి. బీమా కంపెనీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షల జమయ్యాయి, ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి మృతి చెందిన కుటుంబ సభ్యులకు నారా లోకేష్ సంఘీభావ సందేశ పత్రం మరియు బ్యాంకు నగదు జమ ధృవపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సకాలంలో పార్టీ అధిష్ఠానానికి అవసరమైన వివరాలు పంపించడంతో ఈ ప్రమాద బీమా నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అలాగే కార్యకర్తల కుటుంబాలకు ఈ బీమా నిధులు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు , విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, పరిశీలకులు పి ముని శేఖర్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ మల్లయ్య, ప్రజాప్రతినిధులు, వీరంపల్లి టీడీపీ అధ్యక్షులు సంజివయ్య ఆచార్యులు స్వామి,కమిటీ సభ్యులు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.