ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి ఉపాధ్యాయుల, గ్రామస్థుల ఆర్థిక సాయం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 05 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండలం చింతలూరు గ్రామం పేదరికంలో ఉండి కూడా సరస్వతి మాత కరుణను పొందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని 10వ తరగతి లో 562 మార్కులు సాధించి మొదటి లిస్ట్ లోనే బాసరకు ఎంపికయింది. కానీ అమ్మాయి తాడూరి అన్విత కడు పేదరికాన్ని అనుభవిస్తుంది.ఈ మధ్యే అమ్మాయి తండ్రి మరణం ఆమెను కుంగదీసింది.అమ్మాయికి ట్రిపుల్ ఐటీ లో సీటు వచ్చింది కానీ చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితి.ఈ క్రమంలో అమ్మాయి చదివిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భూపతిపూర్ ఉపాధ్యాయులు కాంప్లెక్స్ పాఠశాలల ఉపాధ్యాయులు, మల్యాల పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు,తాటిపెల్లి పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు అలాగే భూపతిపూర్ ప్రధానోపాధ్యాయురాలు రమణి ఉపాధ్యాయు బృందం 22,000 వేలు భూపతిపూర్ గ్రామ దాతల ద్వారా 8000/- మొత్తంగా జమ అయిన 30,000/- వేలను ఈ రోజు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య,కూరగాయల సురేష్ దాతలు రాజేంద్ర ప్రసాద్, మారంపెల్లి లక్ష్మీనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ మామిడిపల్లి మహేష్, చింతలూరు గ్రామ సర్పంచ్ రమేష్,మాజీ సర్పంచ్ శ్రీనివాస్,రవి, గ్రామస్థులు పాల్గొన్నారు