పయనించే సూర్యుడు న్యూస్ : జూన్ /03: నియోజకవర్గం సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామం లోని మండల నాయకత్వంపై బద్దం ఎల్లారెడ్డి, నన్ను సస్పెండ్ చేసే స్థాయి మండల అధ్యక్షుడిది కాదు. పదవులు,పైరవీలు,కమీషన్లు తప్పా.. నీకు పార్టీని నడపడం చేత కాదు. ఒక్క ప్రెస్ పెట్టి మాట్లాడం చేత కాదు. అసలు నీకేం అర్హత ఉందని ఆ పదవిలో కొనసాగుతున్నావ్? షాడోతో జత కట్టి మండలాన్ని భ్రష్టు పట్టిస్తున్న మీ ముగ్గురికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు, కార్యకర్తలు గట్టిగా బుద్ధి చెప్తారు. నేను పార్టీని వదిలే ఆలోచన చేసిన రోజు నుండే పార్టీలో జరుగుతున్న అరాచకాలపై ప్రశ్నించడం మొదలు పెట్టిన. గాలిపల్లి పాక్స్ చైర్మన్ పదవి 30 లక్షలకు అమ్ముకొని.. గాలిపల్లి గ్రామంలో కొత్తగా వచ్చిన 82. ఏండ్ల యువ నాయకుడు సింగిరెడ్డి సుధాకర్ రెడ్డిని పార్టీలో చేర్చుకొని రాజకీయ ఆటలు ఆడుతున్న రోజే నిర్ణయించున్నాను. 7 గ్రామాల పరిధిలోని 350 మంది రైతులను ముంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఒక అవినీతిపరుడు ఉన్న పార్టీలో నేను ఉండనని నిర్ణయించుకున్నాకే మిమ్మల్ని ప్రశ్నించడం మొదలు పెట్టాను. కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన నన్ను ఇదేంటని అడుగుతే పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా?? నాకు నచ్చి రాలేదు నేను కాంగ్రెస్ పార్టీలోకి.. కవ్వంపెల్లి, పార్టీ పరిస్థితి బాగాలేదని బ్రతిమిలాడితే వచ్చి పార్టీని భుజాల మీద వేసుకొని కష్టపడ్డాను. ఇది నా ఒక్కడి ఆవేదన కాదు.. నియోజకవర్గం మొత్తం ఇదే పరిస్థితి. బయటకు రాని ఎంతో మంది నలిగి పోతున్నారు. యువ నాయకుడు గతంలో వేణుగోపాల సొసైటీని ఎన్ని కోట్లకు ముంచాడో ప్రజలకు తెలియదనుకుంటున్నావా? కష్టపడ్డ కార్యకర్తలకు కాకుండా సంచులు మోసిన వాళ్లకు పెత్తనం ఇస్తారా? ఎన్నికల వేళ ముందే చెప్పండి. మాకు డబ్బు సంచులు తెచ్చేవాళ్ళే కావాలి పేద నాయకులు వద్దు, పేద కార్యకర్తలు వద్దు అని చెప్పి ఊళ్ళల్లో తిరగండి. ఆ ముగ్గురు చేస్తున్న అరాచకాలతో జెండా మోసిన పేద నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. కష్టపడి పార్టీని నిలబెట్టిన వారిని పక్కన పెట్టి… డబ్బులు, సెటిల్మెంట్లు చూసుకునే వాళ్లకు పెద్దపీట వేస్తే కార్యకర్తల ఆవేదన ఎప్పటికైనా పేలుతుంది! గుర్తుపెట్టుకో…షాడో నిజం మాట్లాడే గొంతును ఎవరూ ఆపలేరు! ప్రజలు అన్నీ గమనిస్తున్నారు… సమయం వచ్చినప్పుడు సమాధానం కూడా వాళ్లే చెబుతారు!” మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనపై సస్పెన్షన్ చర్యలు తీసుకోవడంపై కాంగ్రెస్ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి మండల నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం విడుదల చేసిన పలువురు నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. “నన్ను సస్పెండ్ చేసే స్థాయి మండల అధ్యక్షుడిది కాదు… పార్టీని నడపడం చేతకాని వారు పదవుల్లో కూర్చొని పైరవీలు, కమీషన్లు చూసుకుంటున్నారు” అంటూ మండిపడ్డారు. షాడో రాజకీయాలతో మండలాన్ని భ్రష్టు పట్టిస్తున్న ముగ్గురు నాయకులకు రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.గాలిపెల్లి. రైతులను మోసం చేసిన వారిని పార్టీలో చేర్చుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. “350 మంది రైతులను ముంచిన అవినీతిపరులను భుజాన వేసుకునే పార్టీలో నేను ఉండను” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కవ్వంపల్లి సత్యనారాయణ, మాట నమ్మి వచ్చి పార్టీ కోసం పని చేశానని, ప్రశ్నించినందుకే సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. “కష్టపడ్డ కార్యకర్తలకు కాదు… డబ్బు సంచులు మోసేవాళ్లకే పెత్తనం ఇస్తున్నారు” అంటూ ఫైర్ అయ్యారు. “జెండా మోసిన పేద కార్యకర్తలు నలిగిపోతున్నారు… నిజం మాట్లాడే గొంతును ఎవరూ ఆపలేరు” అంటూ బద్దం ఎల్లారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మండల కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.